Share News

భజన్ క్లబ్బింగ్‌లో ప్రధాని మోదీ.. అద్భుతమంటూ ప్రశంస

ABN , Publish Date - Sep 26 , 2026 | 10:03 AM

శుక్రవారం ప్రధాని మోదీ ‘భజన్ క్లబ్బింగ్’లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

భజన్ క్లబ్బింగ్‌లో ప్రధాని మోదీ.. అద్భుతమంటూ ప్రశంస
pm modi

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యనే ‘భజన్ క్లబ్బింగ్’ అనే ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. ఇందులో ప్రజలు ఒక చోటకు చేరి సంప్రదాయ భక్తి పాటలను ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మిక భావన కలిగించే గీతాలు పాడుతూ, నృత్యం చేస్తారు. అయితే నిన్న (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఈ ‘భజన్ క్లబ్బింగ్’లో పాల్గొన్నారు. సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ 110వ జయంతి సందర్భంగా ప్రధాని ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. శ్రీరాముడిపై పాడిన భక్తి పాటలను వింటూ ఆయన పులకించారు. అనంతరం ‘భజన్ క్లబ్బింగ్’ అద్భుతంగా ఉందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


భజన్ క్లబ్బింగ్

మద్యం, మత్తు పదార్థాలు లేకుండా నిర్వహించే సంగీత కచేరీనే ‘భజన్ క్లబ్బింగ్’ అంటారు. ఇందులో ఉత్సాహాన్నిచ్చే భక్తి పాటలను ఆలపిస్తారు. నృత్యం చేస్తూ ఆధ్యాత్మిక గీతాలను ఆస్వాదిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు జెన్‌జీ యువతను ఆకట్టుకుంటున్నాయి. కాన్సర్ట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ‘భజన్ క్లబ్బింగ్’ ఉంటుంది.


ఈ వార్తలూ చదవండి

సంఘ సంస్కరణలపై దృష్టి పెట్టండి

సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌‌పై సీఎం విజయ్ ఫైర్

Updated Date - Sep 26 , 2026 | 11:00 AM