Share News

సంఘ సంస్కరణలపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:14 AM

ఓటు బ్యాంకు రాజకీయాలపైన కాకుండా సంఘ సంస్క రణలు, సమాజంలో సానుకూల మార్పు లపై దృష్టి పెట్టాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు

సంఘ సంస్కరణలపై దృష్టి పెట్టండి
narendramodi

  • ఓటు బ్యాంకు రాజకీయాలపై ఫోకస్‌ వద్దు

  • బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచన

న్యూఢిల్లీ, సెప్టెంబరు25: ఓటు బ్యాంకు రాజకీయాలపైన కాకుండా సంఘ సంస్క రణలు, సమాజంలో సానుకూల మార్పు లపై దృష్టి పెట్టాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. గత 12 ఏళ్లుగా దేశంలోని పట్టణాలు, పల్లెల మధ్య అంతరం చాలా తగ్గిపోయిందని అన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు భారీ ఎత్తున మెరుగయ్యాయని తెలిపారు. దేశ మహిళల్లో స్వావలంభన గణనీయంగా పెరిగిందన్నారు. వారాణసి, వాద్‌నగర్‌ మధ్య నిర్వహి స్తున్న సేవా యాత్రలో పాల్గొంటున్న వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్‌గా మాట్లాడారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదని, ఆయన ఓ సంఘ సంస్కర్త అని కొనియాడారు. సమాజంలో పాతుకుపోయిన చెడుపై కూడా ఆయన పోరాడారని గుర్తుచేశారు. ఆ పోరాటానికి కొనసాగింపుగా రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలుగా మనం కూడా సంఘ సంస్కరణపై దృష్టి పెట్టాలన్నారు. సమాజానికి సేవ చేసిన వారికి గౌరవం దక్కాలి అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా సంద ర్భంగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టిన వారి సేవలను కొనియా డారు. వారివల్లే కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, భారత్‌పై గౌరవం ఇనుమడించిందని చెప్పారు. అందుకే వారి కాళ్లు కడిగి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకున్నాను అని వెల్లడించారు.

Updated Date - Sep 26 , 2026 | 05:14 AM