కేంద్రం సమన్లు.. స్పందించిన ఫేస్‌బుక్ యాజమాన్యం
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:11 PM
ఫేస్‌బుక్ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. కేంద్రం సమన్లకు ఫేస్‌బుక్ యాజమాన్యం స్పందించింది.
ఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఫేస్‌బుక్ యాజమాన్యానికి కేంద్రప్రభుత్వం (Central Government) నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. కేంద్రం సమన్లకు ఫేస్‌బుక్ యాజమాన్యం స్పందించింది. మెటా గ్లోబల్ బృందం, కేంద్ర ఐటీ శాఖ అధికారులు ఈరోజు (బుధవారం) సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోస్ట్ తొలగింపు, చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై మెటాను కేంద్ర ప్రభుత్వం స్పష్టత కోరింది. సాంకేతిక లోపాలు, అల్గోరిథం పక్షపాతంపై ఐటీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని వీడియోను అకారణంగా తొలగించడంపై మెటా బృందాన్ని కేంద్రం నిలదీసింది. ‘సాంకేతిక లోపం’ వల్లే ఇలా జరిగిందని మెటా ప్రతినిధులు వాదించగా.. కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ అంశంపై నిష్పాక్షిక విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని మెటా ప్రతినిధులకు కేంద్రం స్పష్టం చేసింది.
మూడు రోజుల్లో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పకపోతే 'సేఫ్ హార్బర్' రక్షణ రద్దు చేస్తామని పార్లమెంటరీ ప్యానెల్ హెచ్చరించిన వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్లాట్‌ఫామ్‌లలో బాలల లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM), డీప్‌ఫేక్ కంటెంట్ నిరోధంలో వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రధాని వీడియోను బ్లాక్ చేసే అల్గోరిథం.. అశ్లీల, నేరపూరిత కంటెంట్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదని కేంద్ర అధికారులు ప్రశ్నించారు. భారతీయ చట్టాలు, సార్వభౌమాధికారానికి లోబడి నడుచుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వార్తలు కూడా చదవండి...
మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు
మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి
తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News