Share News

మహారాష్ట్రలో దారుణం.. కాళ్లకు గొలుసులు, తాళాలతో నవ దంపతుల మృతదేహాలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:34 PM

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో తాపీ నదిలో నవ దంపతుల మృతదేహాలు బయటపడ్డాయి. కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళాలు వేసిన స్థితిలో శ్యామ్‌హరి పాటిల్‌, స్వప్న పాటిల్‌ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్రలో దారుణం.. కాళ్లకు గొలుసులు, తాళాలతో నవ దంపతుల మృతదేహాలు
Legs In Chains Newlywed Couples Bodies found in Maharashtra

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో నవ దంపతుల మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. ధులే జిల్లాలోని తాపీ నదిలో కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి, తాళం వేసిన స్థితిలో వారి మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను జలగావ్‌ జిల్లాకు చెందిన శ్యామ్‌‌హరి పాటిల్‌, స్వప్న పాటిల్‌గా గుర్తించారు పోలీసులు.


శ్యామ్, స్వప్నలు కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారని అధికారులు తెలిపారు. సావల్దే ప్రాంతంలోని నదిలో వారిరువురి మృతదేహాలను గుర్తించినట్టు చెప్పారు. వారి కాళ్లకు తాళం వేసిన ఇనుప గొలుసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా హతమార్చారా? అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. అన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టి తదుపరి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇవీ చదవండి:

‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు హైకోర్టు ఆదేశం

Updated Date - Oct 09 , 2026 | 05:36 PM