ఆ ఆలయాల్లో కూడా అక్రమాలు.. కేసీ వేణుగోపాల్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:11 PM
రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ, జులై 13 (ఆంధ్రజ్యోతి): రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కీలక వ్యాఖ్యలు చేశారు. రామాలయ విరాళాల దొంగతనంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విచారం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఈ తరహా విరాళాల అవకతవకలు కేవలం అయోధ్యకే పరిమితం కాలేదని, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరిగినట్లు నివేదికలు వస్తున్నాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ భారీ విరాళాల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News