తల్లిదండ్రులతో పాటు చెల్లిని దారుణంగా హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి..
ABN , Publish Date - Jan 31 , 2026 | 10:08 AM
ఒక వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు చెల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక(Karnataka)లో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన కుటుంబం మెుత్తాన్ని అతి కిరాతకంగా హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగర జిల్లా(Vizianagara District) కొట్టూరులో జరిగిన ఈ దారుణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గ(Chitradurga) నగరం కిట్టిహళ్లికి చెందిన అక్షయ్ కుమార్(24).. రెండేళ్ల క్రితం కొట్టూరుకు వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. అతడితపాటు తల్లి జయలక్ష్మి(45), తండ్రి భీమరాజ్(50), చెల్లెలు అమృత(17) కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామంలో అక్షయ్ ఒక టైర్ల షాప్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 27న తల్లిదండ్రులను, చెల్లెలిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు.
తన గుట్టు బయటపడుతుందని.. ఎవరికీ అనుమానం రాకుండా బెంగళూరుకు వెళ్లాడు అక్షయ్. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారంటూ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్షయ్ మాటలు, ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అక్షయ్.. తానే కుటుంబ సభ్యులను హత్య చేసినట్టు నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటనే కొట్టూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చి, నిందితుడిని అక్కడి పోలీసులకు అప్పగించారు. అయితే.. ఈ హత్యలకు కారణాలు ఇంకా తెలియరాలేదని, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ జాహ్నవి తెలిపారు.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?
మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్