Share News

దేశరాజధానిలో భారీ వర్షాలు.. విమాన సర్వీసులకు అంతరాయం

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:14 PM

ఢిల్లీలో ఈ రోజు భారీ వర్షాలు కురిశాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. విమాన సర్వీసులకూ అంతరాయం ఏర్పడింది.

దేశరాజధానిలో భారీ వర్షాలు.. విమాన సర్వీసులకు అంతరాయం
Heavy Rains

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు(శనివారం) వర్షాలు దంచికొడుతున్నాయి. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. దీంతో వాతావరణ అధికారులు ఆయా ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ నోటీసులు జారీ చేశారు. ప్రముఖ సంస్థ ఇండిగోతో సహా కొన్ని ఎయిర్‌లైన్ సర్వీసులు తమ ప్రయాణికులకు సూచనలు చేశాయి. విమాన రాకపోకల్లో అంతరాయాలు ఏర్పడొచ్చని, ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందే సర్వీసుల స్థితిని తెలుసుకోవాలని తెలిపాయి. అలాగే టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికులను హెచ్చరించింది.


కొన్ని ప్రాంతాలు జలమయం

శనివారం ఉదయం దేశ రాజధానిలోని గీతా కాలనీ, అక్బర్ రోడ్ తదితర ప్రాంతల్లో భారీ వర్షాలు పడ్డాయి. అధిక వర్షపాతం కారణంగా ఆ ప్రాంతాలు జలమయంగా మారాయి. గ్రేటర్ నొయిడాలో కూడా ఎడతెరిపిలేని వానలు కురిశాయి.

ఢిల్లీ ఉష్ణోగ్రతలు నిన్నటి కంటి 3.4 శాతం తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 0.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పింది.


ఇవి కూడా చదవండి..

ఏపీలో బలహీనంగా రుతుపవనాలు

నేపాల్ వరదల్లో శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు.. 10 రోజుల తర్వాత..

Updated Date - Sep 05 , 2026 | 07:12 PM