బీసీసీఐకి ఐవోఏ షాక్.. సౌకర్యాలు నచ్చకపోతే సొంతంగా ఏర్పాటు చేసుకోండి!
ABN , Publish Date - Sep 05 , 2026 | 03:42 PM
జపాన్ వేదికగా జరగబోయే ఆసియా క్రీడల్లో తమ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేయాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. కానీ, ఈ అభ్యర్థనను భారత ఒలింపిక్ సంఘం తిరస్కరించిందని సమాచారం. అయితే...
స్పోర్ట్స్ డెస్క్: జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు (Asian Game 2026) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో వసతి సదుపాయాలు, క్రికెట్ మైదానంలోని పిచ్ నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆటగాళ్లు ఉండేందుకు చాలా చిన్న గదులను సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ)కు ఓ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తమ ప్లేయర్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని ఐవోఏ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
తమ ప్లేయర్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని ఐవోఏ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఎవరికీ ఇలాంటి వసతి సదుపాయాలు కల్పించడం లేదని, క్రికెటర్లకైనా తమ నిబంధనలు ఒకేలా ఉంటాయని ఐవోఏ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సొంతంగా క్రికెటర్లకు వసతి కల్పించే అవకాశం బీసీసీఐకి ఉందని ఐవోఏ సీఈవో రఘరామ్ అయ్యర్ చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి.
'క్రికెటర్ల వసతి ఏర్పాట్ల గురించి బీసీసీఐ సీఈఓ హేమాంగ్ అమిన్ మమ్మల్ని సంప్రదించారు. మేమిద్దరం సుదీర్ఘమైన చర్చలు జరిపాం. ఆసియా క్రీడల్లో సదుపాయాలను అంచనా వేయడానికి జపాన్‌కు ఓ బృందాన్ని పంపించాలని క్రికెట్ బోర్డు భావించింది. ఐవోఏ కూడా అందుకు అంగీకరించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి అక్కడి నిర్వాహకలు కల్పించిన సదుపాయాలను బీసీసీఐ వినియోగించుకుంటుందా? లేకపోతే స్వతహాగా ఏర్పాట్లు చేసుకుంటుందా? అనేది వారి ఇష్టం. సొంతంగా వసతి కల్పించుకుంటామంటే ఐవోఏకు అభ్యంతరం లేదు. ఐవోఏ మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించదు' అని అయ్యర్ చెప్పినట్లు కథనాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి:
రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..
పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు