Share News

పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు

ABN , Publish Date - Sep 05 , 2026 | 02:47 PM

టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఆమె మరో 78 పరుగులు సాధిస్తే, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది.

పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు
Smriti Mandhana

స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ఆసియా కప్2026లో అసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. శనివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇదే సమయంలో టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


లేడీ విరాట్ కోహ్లీగా పేరొందిన స్మృతి మంధాన ఇప్పటికే అనేక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మంధాన రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మరో 78 పరుగులు సాధిస్తే మరో రికార్డు స్మృతి ఖాతాలో పడుతుంది. మరో 78 పరుగులు చేస్తే.. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్ (4,758 పరుగులు) అగ్రస్థానంలో ఉంది. మంధాన ఇప్పటివరకు 167 మ్యాచ్‌లలో 30.79 సగటుతో 4,681 పరుగులు చేసింది.


ప్రస్తుత టోర్నీలో మంధాన అదరగొడుతోంది. ఇటీవల హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ(124)తో సత్తా చాటిన ఆమె, కేవలం రెండు మ్యాచ్‌లలోనే 143 పరుగులు చేసింది. స్మృతి ఉన్న జోరు చూస్తుంటే బేట్స్ రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు

  • సుజీ బేట్స్(న్యూజిలాండ్) 4758

  • స్మృతి మంధాన(భారత్)-4681

  • హర్మన్‌ప్రీత్ కౌర్(భారత)- 4231

  • చమరి అటపట్టు(శ్రీలంక)- 4094

  • సోఫీ డివైన్(న్యూజిలాండ్)- 3817


ఇవి కూడా చదవండి:

ఒకేరోజు రిటైర్‌మెంట్.. ఆ విషయం చెప్పగానే ధోని షాకయ్యాడు: సురేశ్ రైనా

యూఎస్ ఓపెన్: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపేసిన సబలెంకా

Updated Date - Sep 05 , 2026 | 02:56 PM