హైదరాబాద్‌లో భారీ చోరీ.. . 48 తులాల బంగారం మాయం..
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:31 PM
హైదరాబాద్ మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో భారీ చోరీ కలకలం రేపింది. 11 ఏళ్లుగా అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ నమ్మకం పొందిన నేపాలీ కుటుంబం.. 48 తులాల బంగారాన్ని మాయం చేసినట్లు ఫిర్యాదు నమోదైంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 5: నగరంలోని మల్కాజిగిరి పరిధిలో భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఆనంద్‌బాగ్‌లోని ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో పనిచేసిన నేపాలీ కుటుంబంపై బంగారం చోరీకి సంబంధించి ఫిర్యాదు నమోదైంది. సుమారు 48 తులాల బంగారం చోరీ చేసి, అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకే అపార్ట్‌మెంట్‌లో దాదాపు 11 సంవత్సరాలుగా పనిచేస్తూ యజమానుల నమ్మకాన్ని సంపాదించిన కుటుంబం.. ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్య కారణాలతో భర్త మృతి చెందడంతో.. తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగిన వారు.. ఒక్కసారిగా అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సదరు నేపాలీ కుటుంబం అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 301, 302లో భారీగా బంగారం చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. మొత్తం సుమారు 48 తులాల బంగారం కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం వెలుగులోకి రావడంతో మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబం ఎక్కడికి వెళ్లింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అలాగే చోరీకి సంబంధించిన బంగారం ఎక్కడికి తరలించారు.. ఈ ఘటనలో మరెవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆటో మీటర్.. తొలి 1.6 కి.మీ.కు రూ.30
For More TG News And Telugu News