రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 05 , 2026 | 03:41 PM
పోలాండ్‌లో తాజాగా జరిగిన ఓ రైలు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రైల్వే క్రాసింగ్ వద్ద ట్రక్కు పట్టాల మధ్యలో చిక్కుకుపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: పోలాండ్‌లో తాజాగా జరిగిన ఓ రైలు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రైల్వే క్రాసింగ్ వద్ద ట్రక్కు పట్టాల మధ్యలో చిక్కుకుపోయింది. అదే సమయంలో సుమారు 300 మంది ప్రయాణికులతో వేగంగా వస్తున్న ప్యాసింజర్ రైలు అక్కడికి చేరుకుంది. ట్రక్కును రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు (Poland train accident).
ఈ ప్రమాదం సెప్టెంబర్ 3న పోలాండ్‌లోని గ్దాన్స్క్ లిప్సే (Gdańsk Lipce) ప్రాంతంలోని నిగోవ్స్కా స్ట్రీట్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఓ భారీ ట్రక్కు రైల్వే క్రాసింగ్ పైకి వెళ్లింది. అదే సమయంలో అక్కడి గేట్లు మూసుకుపోవడం ప్రారంభించాయి. దీంతో ట్రక్కు గేట్ల మధ్యలో పట్టాల పైనే ఉండిపోయింది. ట్రక్కు పట్టాల మధ్యలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన అక్కడున్న కొందరు వ్యక్తులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. గేటును పగులగొట్టి అయినా సరే బయటపడాలని సూచించారు (Poland train truck crash).
గ్డినియా నుంచి జిలోనా గోరా వైపు వెళ్తున్న రైలు ఆ సమయంలో అదే ట్రాక్‌పై వేగంగా వస్తోంది (Railway crossing accident). రైలు డ్రైవర్‌కు ట్రాక్‌పై ట్రక్కు కనిపించినప్పటికీ.. అంత వేగంతో వస్తున్న రైలును వెంటనే ఆపడం సాధ్యం కాలేదు. దీంతో ట్రక్కు వెనుక భాగాన్ని రైలు బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ట్రక్కు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత భారీ ప్రమాదం జరిగినప్పటికీ రైలులోని ప్రయాణికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. ట్రక్ డ్రైవర్ కూడా ప్రమాదం తర్వాత వాహనం నుంచి బయటకు వచ్చాడు.
ఇవి కూడా చదవండి...
ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేయాల్సిందే: ఎంపీ రఘునందన్
కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?: మాజీ మంత్రి కేటీఆర్