Share News

బలహీనంగా రుతుపవనాలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:52 AM

నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఆకాశం నిర్మలంగా మారడంతో వేసవి మాదిరి ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

బలహీనంగా రుతుపవనాలు

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఆకాశం నిర్మలంగా మారడంతో వేసవి మాదిరి ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరులో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండ ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం వరకు రాష్ట్రంలో వర్షాలు పెద్దగా పెరిగే అవకాశం లేదని వెల్లడించింది. ఈనెల పదో తేదీ తరువాత ఏర్పడనున్న అల్పపీడనం పయనం మేరకు అంచనాకు వస్తామని వివరించింది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో మేఘావృత వాతావరణం నెలకుంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం కురిసే సమయంలో గంటకు 40-60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ వార్తలను కూడా చదవండి

నిండుకుండలా లుబ్బుర్తి జలాశయం

Updated Date - Sep 05 , 2026 | 05:52 AM