Share News

నేడు గురుపూజోత్సవం

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:55 PM

జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌.శంకరన్‌ ఆడిటోరియంలో ఈ ఏడాది గురుపుజోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు.

నేడు గురుపూజోత్సవం

జిల్లాలో 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

పాడేరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌.శంకరన్‌ ఆడిటోరియంలో ఈ ఏడాది గురుపుజోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, ఇతర అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులను ఈవేడుకలకు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి ఉత్తమ సేవలందించిన 26 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 33 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, 11 మంది హెచ్‌ఎం/ప్రిన్సిపాళ్లు మొత్తం 70 మంది గురువులను ఘనంగా సత్కరించనున్నారు. అలాగే విద్యాలయాల్లోనూ సైతం గురుపుజోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 04 , 2026 | 11:55 PM