Share News

గుజరాత్‌ మాజీ మంత్రి హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:51 PM

గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మోహమ్మద్ అస్గర్ అలీ ముందస్తు విడుదల పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. క్షమాభిక్ష అభ్యర్థనను గుజరాత్ ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో, ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసుకునే అవకాశం దోషికి ఉందని స్పష్టం చేసింది.

గుజరాత్‌ మాజీ మంత్రి హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌ పాండ్యా హత్య కేసు దోషి మోహమ్మద్ అస్గర్ అలీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అస్గర్ అలీ.. ముందస్తు విడుదల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అలీ క్షమాభిక్ష అభ్యర్థనను గుజరాత్‌ ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించడంతో.. ఈ అంశంపై తదుపరి విచారణ అక్కర్లేదని స్పష్టం చేసింది.


అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసుకునే స్వేచ్ఛ దోషికి ఉందని పేర్కొంటూ.. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు విడుదలపై 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గత జులైలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది గుజరాత్ హైకోర్టు. అయితే ప్రభుత్వం ఆ అభ్యర్థనను తిరస్కరించింది.


ఇదీ కేసు..

గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌ పాండ్యా 2003 మార్చి 26న అహ్మదాబాద్‌లోని లా గార్డెన్‌ వద్ద జరిగిన కాల్పుల్లో హత్యకు గురయ్యారు. 2002లో రాష్ట్రంలో జరిగిన మత ఘర్షణలకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో 2007లో ట్రయల్‌ కోర్టు 12 మందిని దోషులుగా తేల్చింది. అయితే.. దర్యాప్తులో లోపాలున్నాయని పేర్కొంటూ గుజరాత్‌ హైకోర్టు 2011లో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత 2019లో సుప్రీంకోర్టు.. నిందితులపై విధించిన శిక్షలు, శిక్ష నిర్ధారణను పునరుద్ధరించింది. తాజాగా ముందస్తు విడుదల అభ్యర్థన తిరస్కరణతో దోషి న్యాయపోరాటం తదుపరి దశకు చేరింది.


ఇవీ చదవండి:

అధికారం అజమాయిషీకి కాదు.. ప్రజలకు సాధికారత కల్పించాలి: మోదీ

రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో విచారణపై స్టే

Updated Date - Oct 13 , 2026 | 01:55 PM