ఢిల్లీలో భారీ జాబ్ స్కాం.. లక్షల్లో దోచుకున్న కేటుగాళ్లు
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:02 PM
ఢిల్లీలో నిరుద్యోగులను విచిత్రమైన తీరులో కేటుగాళ్లు మోసం చేశారు. ఇన్‌కమ్ టాక్స్ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఈ ముఠా లక్షల్లో టోకరా వేసింది. భారీ జాబ్ స్కాం రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.
ఢిల్లీ, జులై 9 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో నిరుద్యోగులను విచిత్రమైన తీరులో కేటుగాళ్లు మోసం చేశారు. ఇన్‌కమ్ టాక్స్ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఈ ముఠా లక్షల్లో టోకరా వేసింది. ఈ భారీ జాబ్ స్కాం (Delhi Job Scam) రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మాజీ ఉద్యోగి చిరాగ్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఐటీ ఆఫీస్ లోపలే నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించి కేటుగాళ్లు బాధితులను నమ్మించారు.
ఏకంగా కార్యాలయం ప్రాంగణంలోనే నకిలీ ఇంటర్వ్యూలు, ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించడం గమనార్హం. ఢిల్లీ సివిక్ సెంటర్‌లోని ఇన్‌కమ్ టాక్స్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఈ నకిలీ నియామకాల పర్వం కొనసాగింది. సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనల ద్వారా నిరుద్యోగ యువతను ఈ ముఠా ఆకర్షించింది. ఒక్కొక్కరి నుంచి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
గతంలో 15 ఏళ్ల పాటు ఐటీ శాఖలోనే పనిచేసిన అనుభవంతో బాధితులను ఆఫీస్ లోపలికి నిందితుడు చిరాగ్ తీసుకెళ్లాడు. నకిలీ వెరిఫికేషన్ ఫాంలు, సర్వీస్ బుక్‌లు చూపించి ఈ ముఠా సభ్యులు నమ్మించారు. అజ్మేరి గేట్ బాధితుడి ఫిర్యాదుతో టెక్నికల్ సర్వైలెన్స్ ద్వారా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, బాధితుల నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కోసం ఢిల్లీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News