ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్తుల భవనం
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:09 PM
ఢిల్లీలో ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్నారనే అనుమానంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
ఇంటర్నె్ట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ నైరుతి ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు. మరికొంత మంది చిక్కుకుపోయారనే అనుమానంతో వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలో పీజీ(పేయింగ్ గెస్ట్)గా సేవలందిస్తున్న ఈ భవనం నేడు(ఆదివారం) మధ్యాహ్నం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కనీసం 50 మంది విద్యార్థులు అందులో ఉండే అవకాశమున్నట్టు స్థానికులు తెలిపారు. సెలవు దినం కావడంతో దాదాపు అందరూ పీజీలోనే ఉండిపోయారని వివరించారు. ఘటనా స్థలంలోనే ఉన్న ఓ విద్యార్థి.. శిథిలాల్లో చిక్కుకుని సాయం కోసం కేకలు వేయడం వినిపించదని చెప్పుకొచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు.. సహాయక చర్యల నిమిత్తం కనీసం 12 ఫైరింజిన్లు సహా ఓ ఎక్స్‌కవేటర్‌ను ఘటనా స్థలానికి పంపారు. అగ్నిమాపక సిబ్బందికి సాయపడేందుకు విపత్తు ప్రతిస్పందనా బృందాలు కూడా మోహరించాయి.
ఇవీ చదవండి:
‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!
మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!