దీపం వివాదం.. ఆదేశాన్ని సమీక్షించాలని సుప్రీంకు విజయ్ మిత్రపక్షాల వినతి
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:10 PM
కార్తీక దీపం వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తమిళనాడులో విజయ్ ప్రభుత్వ మిత్రపక్షాలు తప్పుపట్టాయి. దీపం వెలిగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపై కాంగ్రెస్, ఎండీఎంకే అభ్యంతరం తెలిపాయి.
ఇంటర్నెట్ డెస్క్: కార్తీక దీపం వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తమిళనాడులో విజయ్ ప్రభుత్వ మిత్రపక్షాలు తప్పుపట్టాయి. దీపం వెలిగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపై కాంగ్రెస్, ఎండీఎంకే అభ్యంతరం తెలిపాయి. మదురైలోని తిరుపరంకుండ్రం ఆలయ సమీపంలో ఉన్న దీపస్తంభంపై దీపం వెలిగించవచ్చని ఇచ్చిన ఆదేశాన్ని సమీక్షించాలని సుప్రీంకోర్టును ఆ పార్టీలు కోరాయి. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మాణిక్యం ఠాగూర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘సుప్రీంకోర్టు ఆదేశంతో మేమెంతో నిరాశ చెందాం. మతపరమైన స్వాతంత్య్రం, మత సామరస్యం, రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతలను రక్షించాలి. అలాగే మతపరమైన విశ్వాసాలు, ప్రార్థనా హక్కులను కూడా గౌరవించాలి. అదే సమయంలో దీపం వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలి. తమిళనాడులోని సామాజిక వాతావరణాన్ని కాపాడాలి. ఆ దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలి’ అని ఠాగూర్ పేర్కొన్నారు.
మరో మిత్రపక్షం ఎండీఎంకే కూడా సుప్రీంకోర్టు ఆదేశంపై విమర్శలు చేసింది. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని సుప్రీంకోర్టు ఉల్లంఘించిందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఒక ప్రకటనలో అన్నారు. ‘సుప్రీంకోర్టు తన పరిధులన్నింటినీ దాటింది. మన రాజ్యాంగ ప్రాథమిక సూత్రం లౌకికవాదం’ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అన్నాడీఎంకే, బీజేపీ తీవ్రంగా మండిపడ్డాయి. విజయ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కేపీ రామలింగం విమర్శించారు. విజయ్ తిరుపరంకుండ్రం కొండ ఎక్కి కిందకు చూడాలని, అప్పుడు ఆయన సమస్యలన్నీ మాయమవుతాయని మరో బీజేపీ నేత వినోజ్ సెల్వం ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!
కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి
డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి సమావేశం.. శరద్ పవార్ పార్టీ గైర్హాజరు