ఏ ఒక్కరితోనో కాంగ్రెస్ ముందుకెళ్లదు
ABN , Publish Date - Apr 02 , 2026 | 01:25 PM
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల ద్వారా మాత్రమే ప్రగతి సాధిస్తుందని, ఏ ఒక్క వ్యక్తితోనో ముందుకు వెళ్లదని, అది సీఎం సిద్దరామయ్య అయినా మంత్రి జమీర్ అయినా ఒక్కటేనని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.
సిద్ధాంతాలు, కార్యకర్తలే ముఖ్యం: డీసీఎం
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల ద్వారా మాత్రమే ప్రగతి సాధిస్తుందని, ఏ ఒక్క వ్యక్తితోనో ముందుకు వెళ్లదని, అది సీఎం సిద్దరామయ్య అయినా మంత్రి జమీర్ అయినా ఒక్కటేనని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. దావణగెరె దక్షిణ అభ్యర్థి సిద్దార్థ్ శ్యామనూరు తరుఫున ప్రచారసభలో బుధవారం ఆయన మాట్లాడారు. పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదని సమైక్యంగానే ముందుకెళ్లి ఎన్నికలను ఎదురిస్తామన్నారు.
అస్సోంలో ఎన్నికల ప్రచారంలో రెండు రోజులు పాల్గొన్నానని దావణగెరె, బాగల్‌కోటలలో ప్రచారం చేశాక కేరళ వెళతానన్నారు. ఆతర్వాత అస్సోం ఎన్నికల కోసం వెళతానన్నారు. మీడియాలో కాంగ్రెస్లో అసంతృప్తికి తెరదించామన్నారు. జమీర్ అహ్మద్ అసంతృప్తిపై ఆయనకు కేరళలో కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. రెండుమూడు రోజుల తర్వాత రాష్ట్రంలోనూ ప్రచారంలో పాల్గొంటారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేశంలో డిజిటల్ జనగణన ప్రారంభం
యుద్ధం ప్రభావం ప్రజల మీద పడొద్దు!
Read Latest Telangana News and National News