మా రైతుల ప్రయోజనాలు పట్టించుకోరా?.. డీకేకు మాణిక్యం ఠాగూర్ నిలదీత
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:37 PM
కర్ణాటక ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న మేకెదాటు ప్రాజెక్టుపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ ప్రాజెక్టుపై తమిళనాడు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టు కోసం పట్టుబడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఎక్స్‌లో ఆయన తప్పుపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న మేకెదాటు ప్రాజెక్టుపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ ప్రాజెక్టుపై తమిళనాడు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టు కోసం పట్టుబడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఎక్స్‌లో ఆయన తప్పుపట్టారు. తమిళనాడు రైతుల ప్రయోజనాలను డీకే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు తుది ఆమోదం ఇవ్వకూడదని కేంద్రాన్ని ఆయన కోరారు. ప్రాజెక్టు కట్టాలని చూస్తే తమ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం ఎంత వరకైనా పోరాడుతామని హెచ్చరించారు. ప్రతిపాదిత డ్యామ్‌కు చట్టబద్ధంగా ఉన్న అనుమతులను వెంటనే క్లియర్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని డీకే శిమకుమార్ ఇటీవలే మైసూరులో కోరిన నేపథ్యంలో మాణిక్యం స్పందించారు.
డీకే ఏమన్నారంటే..
మైసూరులో ఈనెల 13న జరిగిన కార్యక్రమంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఆ ప్రాజెక్టుకు కేంద్రం తుది ఆమోదం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో మాణిక్యం స్పందిస్తూ డీకే వ్యాఖ్యలు సరికావన్నారు. కర్ణాటక సీఎం వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నిర్ణయానికి, కావేరి నదీ జలాల ట్రైబ్యునల్ తుది తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. డీకే వ్యాఖ్యలు ఖండనీయమని అన్నారు. కావేరి నదీ జలాల పంపిణీ ఒప్పందం ప్రకారం దిగువ పరివాహక రాష్ట్రమైన తమిళనాడుకు ఉన్న హక్కులను విస్మరించి, నదిపై ప్రభావం చూపే ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన సూచించారు. తమిళనాడు అంగీకారం లేకుండా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే అది చట్టవ్యతిరేకం అవుతుందని, అంతేకాకుండా తమిళనాడు డెల్టా జిల్లాల రైతులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
ఎందుకు వివాదం..
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సొంతూరు అయిన కనకపుర సమీపంలో కావేరి నదిపై మేకెదాటు డ్యాం కట్టాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కరువు సమయంలో ఆ ప్రాజెక్టు ఒక బఫర్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో తమిళనాడుకు చాలినన్ని నీళ్లు దొరికేలా చూస్తామని కర్ణాటక హామీ ఇస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టును తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తే, కావేరి జలాల్లో తమ రాష్ట్ర వాటాపై ప్రభావం పడుతుందని, ఆ నదిపై ఆధారపడిన రైతులకూ నష్టం కలుగుతుందని తమిళనాడు వాదిస్తోంది.
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు