నాలుగేళ్ల తర్వాత ఆ ల్యాప్‌టాప్ మీకే..!
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:09 AM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత కలిగిన అధికారులు ఇకపై రూ.1.8 లక్షల విలువైన ల్యాప్ టాప్ ను నాలుగేళ్ల వినియోగం తర్వాత ఉచితంగా తమ సొంతానికి తీసేసుకోవచ్చని తెలిపింది
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
న్యూఢిల్లీ, నవంబరు 13: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత కలిగిన అధికారులు ఇకపై రూ.1.8 లక్షల విలువైన ల్యాప్ టాప్ ను నాలుగేళ్ల వినియోగం తర్వాత ఉచితంగా తమ సొంతానికి తీసేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. అర్హులైన కేంద్రప్రభుత్వ ఉద్యోగులు తమకు ఇచ్చిన ల్యాప్‌టా్‌పలు, ట్యాబ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నాలుగేళ్లు ఉపయోగించిన తర్వాత వాటిని ఉచితంగా తమవద్దే ఉంచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు