Share News

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:52 PM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని, దీనికి సంబంధించి ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు.

 నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్‌ చేయిస్తున్నారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ(శుక్రవారం)ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిర్వహించిన 'ఆస్క్ మీ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు తన ఫోన్‌ను పైకి ఎత్తి చూపిస్తూ.. ట్యాపింగ్ జరిగినట్లు తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ విషయం ప్రధానికి కూడా బాగా తెలుసని వ్యాఖ్యానించారు.


ఇదే వేదికగా ప్రధాని మోదీ బహిరంగ చర్చ జరపాలని రాహుల్ గాంధీ సవాల్‌ విసిరారు. ముఖాముఖి చర్చ జరిగితే ఎవరు దేశద్రోహి, విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరూ ఉన్నారో అర్థమవుతుందని రాహుల్ పేర్కొన్నారు. కాగా, గతంలో కూడా పెగాసస్ స్పైవేర్ ద్వారా తనతో పాటు పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ట్యాపింగ్ చేస్తున్నాయని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలను తీవ్రంగా ఖండించింది. ఇదే అంశాన్ని శుక్రవారం రాహుల్ గాంధీ మరోసారి లేవనెత్తారు. ఏదేమైనప్పటికీ, రాహుల్‌ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి:

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచిన ఏపీ ప్రభుత్వం

ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. కేంద్ర ఆర్థిక సాయం కోరనున్న ప్రభుత్వం

Updated Date - Nov 13 , 2026 | 04:06 PM