Share News

ఆర్ఏసీలో ప్రయాణికుల ఇబ్బందులకు తెరదించేలా రైల్వే బోర్డు అడుగులు!

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:07 PM

రైలు ప్రయాణంలో ఆర్ఏసీ విధానానికి స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా దశాబ్దాల నాటి ఈ పద్ధతిని పూర్తిగా తొలగించే దిశగా రైల్వే బోర్డు అడుగులు వేస్తోంది.

ఆర్ఏసీలో ప్రయాణికుల ఇబ్బందులకు తెరదించేలా రైల్వే బోర్డు అడుగులు!
ndian Railways

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణంలో ఆర్ఏసీ (Reservation Against Cancellation) విధానానికి స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా దశాబ్దాల నాటి ఈ పద్ధతిని పూర్తిగా తొలగించే దిశగా రైల్వే బోర్డు అడుగులు వేస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆర్ఏసీ టికెట్ కలిగిన ఇద్దరు ప్రయాణికులు ఒకే బెర్త్‌ను పంచుకోవాల్సి వస్తోంది. అయితే, పూర్తి ఛార్జీలు చెల్లించినప్పటికీ కనీసం సరిగ్గా పడుకునేందుకు కూడా బెర్త్ దక్కకపోవడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఒకే బెర్త్‌పై ఇద్దరు ప్రయాణించడం, అందులోనూ భిన్న ప్రాంతాల వారు లేదా పురుషులు, మహిళలు కలిసి సర్దుకుపోవాల్సి రావడం తీవ్ర ఇబ్బందికరంగా మారుతోందని రైల్వే అధికారులు గుర్తించారు.


ఈ అంశంపై ఇటీవలే ఒక పార్లమెంటరీ ప్యానెల్ కూడా తీవ్రంగా స్పందించింది. సరైన బెర్త్ సౌకర్యం లభించనప్పుడు ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆ ప్యానెల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాగా గతంలో టికెట్ల బుకింగ్, రద్దు ప్రక్రియ మాన్యువల్‌గా ఉన్న రోజుల్లో ప్రయాణికులకు వెసులుబాటు కల్పించడానికి ఈ ఆర్ఏసీ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ, ప్రస్తుతం డిజిటల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినందున దీని కొనసాగింపుపై పునరాలోచనలో పడ్డారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆర్ఏసీ రద్దు జరిగితే ప్రయాణికులకు పూర్తి స్థాయి కన్ఫర్మ్డ్ బెర్త్‌లు లభించి వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలూ చదవండి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 03:12 PM