Share News

మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం.. అమెరికా జైలులో ఖైదీల విడుదలకు బ్రేక్..

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:59 PM

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ సంస్థలను, ఉద్యోగులను మాత్రమే కాదు.. అమెరికాలోని ఓ జైలు ఖైదీలను కూడా మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం ఇబ్బంది పెడుతోంది.

మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం.. అమెరికా జైలులో ఖైదీల విడుదలకు బ్రేక్..
US Jail News

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ సంస్థలను, ఉద్యోగులను మాత్రమే కాదు.. అమెరికాలోని ఓ జైలు ఖైదీలను కూడా మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం ఇబ్బంది పెడుతోంది. బెయిల్ డబ్బులు చెల్లించినప్పటికీ కొందరు ఖైదీలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కారణంగా ఆన్‌లైన్ బెయిల్ చెల్లింపుల ధ్రువీకరణ ఈ జైలులో నిలిచిపోయింది. దీంతో ఖైదీలను విడుదల చేయాలంటే బెయిల్ మొత్తాన్ని నేరుగా జైలుకు వచ్చి చెల్లించాలని అధికారులు సూచించారు (Microsoft Outage 2026).


అమెరికాలోని కొలరాడో రాష్ట్రం అరాపాహో కౌంటీ డిటెన్షన్ ఫెసిలిటీలో ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ సేవల్లో అంతరాయం కారణంగా ఖైదీల బెయిల్ చెల్లింపులకు సంబంధించిన ఈ-మెయిళ్లు జైలు అధికారులకు అందడం లేదు. సాధారణంగా ఖైదీల తరఫున కుటుంబ సభ్యులు లేదా ఇతరులు ఆన్‌లైన్‌లో బెయిల్ మొత్తం చెల్లిస్తారు. ఆ చెల్లింపు పూర్తయినట్లు సంబంధిత ఈమెయిల్ సమాచారం జైలుకు చేరిన తర్వాత విడుదల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఔట్‌లుక్ సేవలు పనిచేయకపోవడంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది (Microsoft Outlook Down).


ఈ సమస్యపై అరాపాహో కౌంటీ షెరీఫ్ కార్యాలయం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో అధికారిక ప్రకటన విడుదల చేసింది (Arapahoe County Jail). మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కారణంగా ఆన్‌లైన్ బెయిల్ చెల్లింపులకు సంబంధించిన ఈమెయిల్ నోటిఫికేషన్లు అందడం లేదని వెల్లడించింది. ఔట్‌లుక్ సేవలు పునరుద్ధరించే వరకు ఖైదీలను విడుదల చేయడం కుదరదని, ఒకవేళ వెంటనే విడుదల చేయించాలనుకుంటే బెయిల్ మొత్తాన్ని నేరుగా జైలుకు వచ్చి చెల్లించాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!


న్యూజిలాండ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు కివీస్ స్కోరు 75/2

Updated Date - Nov 13 , 2026 | 02:05 PM