దేశ ప్రగతికి బీహెచ్‌ఈఎల్ వెన్నెముక
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:28 AM
భారత ఇంధన, పారిశ్రామిక రంగాల స్వయం సమృద్థికి భారత్ హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఆరు దశాబ్దాలకు పైగా వెన్నెముకగా నిలుస్తోందని ...
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
న్యూఢిల్లీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): భారత ఇంధన, పారిశ్రామిక రంగాల స్వయం సమృద్థికి భారత్ హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఆరు దశాబ్దాలకు పైగా వెన్నెముకగా నిలుస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. శుక్రవారం నోయిడాలోని బీహెచ్‌ఈఎల్ సదన్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సంస్థ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. 1964లో ఏర్పాటైన బీహెచ్‌ఈఎల్ దేశ నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఎదిగిందన్నారు. దేశంలోని మొత్తం థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో 53 శాతానికి పైగా వాటా కలిగి ఉండటం సంస్థ సాంకేతిక సత్తాకు నిదర్శనమని కొనియాడారు. అనంతరం ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్