మేక్ ఇన్ ఇండియా’ కాదు.. ‘బ్రేక్ ఇన్ ఇండియా’
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:13 AM
కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో దేశాన్ని వంచిస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
బీజేపీ విధానాలతో యువతకు దక్కని ఉద్యోగాలు: ఖర్గే
న్యూఢిల్లీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో దేశాన్ని వంచిస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీ దేశాన్ని ‘బ్రేక్ ఇన్ ఇండియా’ వైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో పారిశ్రామిక రంగం కుంటుపడిందని, యువతకు ఉద్యోగాలు లభించడం లేదని మండిపడ్డారు. నీతి ఆయోగ్, ఐఐఎం అహ్మదాబాద్ సంయుక్తంగా విడుదల చేసిన ‘పీఎల్‌ఐ పథకాల ప్రభావ అంచనా’ నివేదికను ఉటంకిస్తూ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా కేంద్రంపై ఖర్గే విమర్శలు చేశారు.
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు