శాటిలైట్ ‘కిల్ స్విచ్’ భారత్ చేతిలోనే ఉండాలి
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:03 AM
దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని శాటిలైట్ కమ్యూనికేషన్ల ‘కిల్ స్విచ్’ నియంత్రణ భారత్ చేతుల్లోనే ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ అన్నారు.
భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్
న్యూఢిల్లీ, నవంబరు 13: దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని శాటిలైట్ కమ్యూనికేషన్ల ‘కిల్ స్విచ్’ నియంత్రణ భారత్ చేతుల్లోనే ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ అన్నారు. ఈ విషయంలో విదేశీ సంస్థలపై లేదా ఒకే ప్రొవైడర్‌పై ఆధారపడడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిత్తల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోకి ఇంటర్నెట్ సేవల ప్రవేశం విషయంలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పరోక్షంగా స్పందించిన మిత్తల్.. భారతదేశ ఉపగ్రహ కమ్యూనికేషన్ల ‘కిల్ స్విచ్’ దేశ సరిహద్దుల్లోనే ఉండాలని సూచించారు. ఆధునిక యుద్ధం ఇప్పుడు అంతరిక్షంలోకి కూడా విస్తరించింది కాబట్టి ఉపగ్రహ ఆపరేటర్లకు లైసెన్స్‌లు ఇచ్చే విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ సమర్థనీయమేనని అన్నారు
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు