Share News

సీజేపీ నేతలు అశుతోశ్ రాంకా, సౌరవ్ కస్టడీ మరో 2 రోజుల పొడిగింపు

ABN , Publish Date - Oct 19 , 2026 | 08:16 PM

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు అశుతోశ్ రాంకా, సౌరవ్ దాస్‌ల జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించారు. ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 21 వరకు వారి కస్టడీని పొడిగించింది. అంతకుముందు రాంకా, దాస్‌ల కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరగా.. రెండు రోజుల పొడిగింపునకు మాత్రమే కోర్టు అనుమతించింది.

సీజేపీ నేతలు అశుతోశ్ రాంకా, సౌరవ్ కస్టడీ మరో 2 రోజుల పొడిగింపు

ఇంటర్‌నెట్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు అశుతోశ్ రాంకా, సౌరవ్ దాస్‌ల జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించారు. ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 21 వరకు వారి కస్టడీని పొడిగించింది. అంతకుముందు రాంకా, దాస్‌ల కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరగా.. రెండు రోజుల పొడిగింపునకు మాత్రమే కోర్టు అనుమతించింది. కాగా.. ఆ ఇద్దరిని విడుదల చేయాలని కోరుతూ సోమవారం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వు చేసింది. అంతకుముందు, ముందస్తు నిర్బంధంలో భాగంగా ఆశుతోశ్ రాంకా, సౌరవ్ దాస్‌ను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించిన విషయం తెలిసిందే.


తమ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి, కోర్టు విచారణలను కావాలనే ఆలస్యం చేస్తున్నారని సీజేపీ ఆరోపించింది. బెయిల్ కోసం ముందుకు వచ్చిన ష్యూరిటీలను కూడా సరైన కారణాలు లేకుండా తిరస్కరించారని ఆ పార్టీ ఆరోపించింది. కాగా.. ఈ కేసులో విచారణ జరుపుతున్న మేజిస్ట్రేట్‌కు బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ కేసు నమోదు చేశారు. ఈనెల 13న సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకా, అజింక్య షిండే సహా సీజేపీకి చెందిన మొత్తం 14 మంది జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. అక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదని, అంతేకాకుండా సీజేపీ నేతలు తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిలో అజింక్య షిండేకు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.


ఈ వార్తలూ చదవండి:

విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్

టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో

Updated Date - Oct 19 , 2026 | 08:28 PM