Share News

మణిపూర్‌లో మళ్లీ హింస.. నలుగురి మృతి

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:58 PM

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలోని రెండు చోట్ల హింస చెలరేగింది. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు. ఒక హింసాత్మక ఘటన ఆదివారం రాత్రి జరగగా.. మరో ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

మణిపూర్‌లో మళ్లీ హింస.. నలుగురి మృతి

ఇంటర్‌నెట్ డెస్క్: మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలోని రెండు చోట్ల హింస చెలరేగింది. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు. ఒక హింసాత్మక ఘటన ఆదివారం రాత్రి జరగగా.. మరో ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మైతీలు, పంగల్ ముస్లింలు నివసించే చోట ఆదివారం రాత్రి ఓ సంగీత కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారు. అంతేకాకుండా కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడగా.. ఓ యువకుడు చనిపోయాడు.


రెండో ఘటనలో సోమవారం ఉదయం ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలోని ఖమేన్‌లోక్‌ సమీపంలోని కొండప్రాంతంలో వంటచెరుకు కోసం వెళ్లిన వారిపై ట్రైబల్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలతో స్థానిక గ్రామస్థులు కోపోద్రిక్తులయ్యారు. హింసకు వ్యతిరేకంగా ఇంఫాల్‌లో సోమవారం భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో నగరం మొత్తం స్తంభించిపోయింది. పలువురు స్థానికులు రెండు మృతదేహాలను ముఖ్యమంత్రి నివాసం బయట ఉంచి ఆందోళన నిర్వహించారు. తర్వాత పోలీసులు లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను అక్కడి నుంచి పంపించారు. కాగా.. ట్రైబల్ మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడి రాజ్ మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి థోక్ చోమ్ లోకేషోర్ సింగ్ పరామర్శించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత

‘హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమలాపురంలో ఉద్రిక్తత.. చలాన్ల వివాదంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

Updated Date - Oct 19 , 2026 | 06:42 PM