ఐదేళ్ల బాలుడి నోటిలోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:59 PM
పిల్లలు ఆడుకునే సమయంలో వారిపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న.. పెనుప్రమాదాలు సంభవించి.. ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా గుజరాత్లో ఐదేళ్ల బాలుడి నోట్లోకి ఇనుప రాడ్ దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలు ఆడుకునే సమయంలో వారిపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న.. పెనుప్రమాదాలు సంభవించి.. ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా గుజరాత్లో ఐదేళ్ల బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పాటన్ జిల్లా సమీ తాలూకా వేద్ గ్రామంలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో నేలపై ఉన్న ఇనుప చువ్వుపై పడ్డాడు. అది కాస్తా ఆ బాలుడి నోటిలోకి తీవ్రంగా దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఆ బాలుడికి విపరీతంగా రక్తస్రావం జరిగింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు '108' వాహనంలో బాలుడిని రాధన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా.. ఇనుప రాడ్ బాలుడి దవడ, దంతాల మధ్య చాలా లోతుగా ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్య సిబ్బంది ఒక ప్రైవేట్ డెంటల్ సర్జన్‌ను రప్పించారు. అంతేకాక బాలుడికి ఆపరేషన్ చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
దాదాపు నలభై నిమిషాల పాటు శ్రమించిన వైద్యుల బృందం.. బాలుడి దవడకు, దాని చుట్టుపక్కల కణజాలానికి ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా ఆ ఇనుప రాడ్‌ను తొలగించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో బాలుడి ప్రాణాలకు ప్రమాదం తప్పింది. సమయానికి స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:
‘హింస అనేది వాళ్ల డీఎన్ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే..