పరగడుపునే టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:56 PM
టీలో కెఫీన్‌తోపాటు ఇతర రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియపై ప్రభావం చూపవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: చాలామందికి ఉదయం నిద్రలేవగానే టీ తాగడం అలవాటు. టీ తాగిన తరువాతే వారి రోజువారీ పనులను ప్రారంభమవుతాయి. అయితే ఈ అలవాటు కొందరిలో జీర్ణ సంబంధిత సమస్యలకు కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎసిడిటీ, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇంతకీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందామా..?
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీలో కెఫీన్‌తోపాటు ఇతర రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియపై ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడేవారికి ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అసౌకర్యం పెరిగే అవకాశం ఉంది. పరగడుపున టీ తాగిన తరువాత కడుపులో మంట, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. అయితే టీ తాగిన ప్రతి ఒక్కరికీ ఇలాంటి సమస్యలు రాకపోవచ్చు. టీ మోతాదు, చిక్కదనం వంటి అంశాల ఆధారంగా ఈ సమస్యలు వస్తాయి.
ఉదయం టీ తాగే అలవాటు ఉంటే ఈ జాగ్రత్తలు ముఖ్యం సుమీ
ముందుగా నీరు తాగండి: నిద్రలేవగానే ఒక గ్లాసు నీరు తాగండి. దీంతో శరీరానికి ద్రవాలు అందుతాయి.
కొంత ఆహారం తీసుకున్న తరువాత టీ: ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు ఎసిడిటీ లేదా కడుపులో మంట వస్తుంటే, తేలికపాటి ఆహారం తీసుకున్న తరువాత టీ తాగడం మంచిది.
టీ మోతాదును తగ్గించండి: రోజంతా పదేపదే టీ తాగడం, మరీ చిక్కగా తయారు చేసుకోవడం తగ్గించాలి. కెఫీన్‌కు సున్నితంగా స్పందించే వారు తమకు ఇబ్బంది కలిగించని మోతాదును ఎంచుకోవాలి.
లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి: తరచూ కడుపునొప్పి, గుండెల్లో మంట లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి.
టీ పూర్తిగా మానేయాలా?
ఉదయం టీ తాగే అలవాటు ఉన్నవారంతా దానిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు అసౌకర్యం ఎదురైతే ఆ అలవాటులో మార్పులు చేసుకోవాలి. సరైన మోతాదులో టీ తీసుకోవడం, తగినంత నీరు తాగడం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.
ఇవీ చదవండి
షుగర్ ముప్పు.. మేల్కోకుంటే తప్పదు మూల్యం
సగం మంది వెన్నునొప్పి బాధితులే..!