Share News

ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:01 PM

ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికలకు పారామిలిటరీ బలగాలు కేటాయించాలని డివిజినల్‌ బెంచ్‌లో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.

ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
AP High Court

అమరావతి, అక్టోబర్ 19: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతల కోసం పారామిలిటరీ బలగాలను కేటాయించాలని వైసీపీ వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అంతకుముందు, స్థానిక ఎన్నికలకు పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. పశ్చిమబెంగాల్‌లో పరిస్థితులు, ఏపీ పరిస్థితులను పోల్చిచూడలేమని.. పారామిలిటరీ బలగాల అవసరం లేదని ఏపీ ప్రభుత్వం వాదించింది. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది.


ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో వైసీపీ అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌‌పై వెకేషన్ బెంచ్ ఎదుట విచారణ జరిగింది. పారామిలిటరీ బలగాలు కావాలని కోరడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనల అనంతరం వైసీపీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.


ఇవి కూడా చదవండి...

‘హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమలాపురంలో ఉద్రిక్తత.. చలాన్ల వివాదంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 04:15 PM