టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. రేహన్తో పదేళ్లుగా సంబంధాలు లేవన్న తండ్రి
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:48 PM
ముంబైలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు అర్ధరాత్రి కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో నిందితుల్లో ఒకడైన రేహన్ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు అర్ధరాత్రి కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆయన డ్రైవర్ చేతికి బుల్లెట్ తగలడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. ముగ్గురు నిందితులను పట్టుకుంది. నిందితుల్లో ఒకడైన రేహన్ గురించి అతడి తండ్రి షుదీన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రేహన్ చాలా ఏళ్లుగా తన తండ్రికి దూరంగా నివసిస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలంగా తన కొడుకును చూడలేదని, మాట్లాడలేదని షుదీన్ పేర్కొన్నాడు. అతడు మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకుపై వస్తున్న ఆరోపణల గురించి తనకు తెలియదని, అతడి గురించి చట్టమే చూసుకుంటుందని వెల్లడించాడు. గతంలో గన్‌కు సంబంధించిన ఓ కేసులో రేహన్ నిందితుడిగా ఉన్నాడని అతడి తండ్రి తెలిపాడు. అయితే తనకు తెలిసినంత వరకు అతడిపై ఆ కేసు మినహా మరో కేసు ఏదీ లేదని షుదీన్ పేర్కొన్నాడు. ఆ పాత కేసు నాలుగైదు నెలల క్రితం నమోదైందని, అతడి తల్లి ఏర్పాటు చేసిన లాయర్ ద్వారా బెయిల్‌పై రేహన్ విడుదలయ్యాడని తెలిపాడు.
బెయిల్‌పై విడుదలైన తర్వాత రేహాన్ అతడి తల్లితోనే ఉన్నాడని షుదీన్ పేర్కొన్నాడు. రేహన్ తల్లిదండ్రులు దాదాపు పదేళ్ల నుంచి విడివిడిగా నివసిస్తున్నట్లు సమాచారం. రేహన్ తల్లి సంసిదా ఒక ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తుందని తెలుస్తోంది. రేహన్ 9వ తరగతి వరకు చదివి మధ్యలోనే మానేసినట్లు సమాచారం. జైలు నుంచి విడుదలైన తర్వాత రేహన్ వెల్డింగ్ పని చేపట్టాడని అతడి మేనత్త అఫ్సానా స్థానిక మీడియాకు తెలిపింది. రేహన్తో పాటు మరో ఇద్దరు ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా రాజస్థాన్‌లోని కోటాలో పోలీసులు పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
‘హింస అనేది వాళ్ల డీఎన్ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
అమలాపురంలో ఉద్రిక్తత.. చలాన్ల వివాదంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట