Share News

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో

ABN , Publish Date - Oct 19 , 2026 | 09:56 AM

నిన్న (ఆదివారం) టైగర్‌ ష్రాఫ్‌ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడిన నిందితుల ఫొటో విడుదలైంది.

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో

ఇంటర్నెట్ డెస్క్: బాలివుడ్ స్టార్ టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో నిందితుల తొలి ఫొటో బయటకొచ్చింది. తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు నిందితులుగా గుర్తించారు. వీరి కోసం ముంబై నగరమంతా తీవ్రంగా గాలిస్తున్నారు. జుహు పోలీసుస్టేషన్‌ పరిధిలోని టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి ష్రాఫ్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించారు. అయితే వీరి పూర్తి వివరాలు ఇంకా లభించలేదు.Untitled-1 copy.jpg


మరోవైపు నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు అంధేరీ రైల్వే స్టేషన్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం ముంబైకి చెందినదని తెలుస్తోంది. కాగా నిన్న (ఆదివారం) టైగర్‌ ష్రాఫ్‌ ప్రయాణిస్తున్న కారుపై నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారు. ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగిన ఈ దాడి నుంచి టైగర్‌ సురక్షితంగా తప్పించుకోగా, ఆయన కారు డ్రైవర్‌, మరో ఆటో డ్రైవర్‌ గాయపడ్డారు. అయితే ష్రాఫ్‌పై దాడి తమ పనేనని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించింది. సల్మాన్‌ ఖాన్‌తో పని చేసిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని బిష్ణోయ్‌ ముఠాకి చెందిన అనిల్‌ పండిట్‌ ఓ పోస్టు చేశాడు.


ఈ వార్తలూ చదవండి

టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం

నూడుల్స్‌లో తండ్రే విషం కలిపాడు

Updated Date - Oct 19 , 2026 | 10:15 AM