Share News

నూడుల్స్‌లో తండ్రే విషం కలిపాడు

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:18 AM

యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో శుక్రవారం రాత్రి నూడుల్స్‌ తిని, టీ తాగి పడుకున్న ఐదుగురు కుటుంబసభ్యులు తెల్లవారేసరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో..

నూడుల్స్‌లో తండ్రే విషం కలిపాడు

  • ఐదుగురి మృతి కేసులో పోలీసుల వెల్లడి

నోయిడా, అక్టోబరు 18: యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో శుక్రవారం రాత్రి నూడుల్స్‌ తిని, టీ తాగి పడుకున్న ఐదుగురు కుటుంబసభ్యులు తెల్లవారేసరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దంపతులు, ముగ్గురు పిల్లల మరణానికి ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణం కాదని, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి తగాదాలతోనే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. తండ్రి మహేశ్‌ (38) స్వయంగా తాను, తన భార్య లలిత (35), కుమార్తె మిష్టి (7), కుమారులు లడ్డు (11), సాక్షిత్‌ (3) తిన్న నూడుల్స్‌లో విషం కలిపాడని పేర్కొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 06:21 AM