Share News

ఔరా.. అందాల పోలవరం

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:13 AM

పచ్చని గిరుల్లో ప్రకృతి గీసిన రమణీయ దృశ్యం.. నీలి మేఘాల నీడలో కట్ట దాటి ఉప్పొంగే జలధారలు.. చూసే ప్రతి హృదయంలో ఆనంద పరవళ్లు.. ఇదీ.. మన పోలవరం ప్రాజెక్టు వద్ద గోదారి సోయగాల తీరు..!

ఔరా.. అందాల పోలవరం
polavaram project view

పచ్చని గిరుల్లో ప్రకృతి గీసిన రమణీయ దృశ్యం.. నీలి మేఘాల నీడలో కట్ట దాటి ఉప్పొంగే జలధారలు.. చూసే ప్రతి హృదయంలో ఆనంద పరవళ్లు.. ఇదీ.. మన పోలవరం ప్రాజెక్టు వద్ద గోదారి సోయగాల తీరు..! అద్భుతం కదూ!.. కొద్దిరోజులుగా.. ఎగువన కురిసిన వర్షాలకు గోదావరికి ఎర్రనీరు వచ్చేది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో బురద నీరు తగ్గి నీరు పూర్తిగా స్వచ్ఛంగా పరవళ్లు తొక్కుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఆదివారం గోదావరికి ఇరువైపులా పచ్చని తివాచీ పరిచినట్టు కొండల పచ్చదనం.. ఆకాశంలో తెల్లని మబ్బులు.. ఔరా అనిపించాయి. సీలేరు నుంచి గోదావరిలోకి చేరుతున్న నీటిలో మట్టికణాల పరిమాణం తగ్గడంతో నీరు ఇలా నీలివర్ణంతో కనువిందు చేస్తోంది. ప్రస్తుతం వరద పూర్తిగా తగ్గడంతో గోదావరిలో సాధారణ ప్రవాహం కొనసాగుతోంది.

- పోలవరం, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 19 , 2026 | 06:15 AM