Share News

చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడిగా మలయప్ప

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:24 AM

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్పస్వామి విహరించారు.

చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడిగా మలయప్ప
MALAYAPPASWAMY

  • నేటితో ముగియనున్న వాహన సేవలు

తిరుమల, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్పస్వామి విహరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో స్వామివారు తిరువీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఇక ఉదయం వాహన మండపానికి వేంచేసిన స్వామివారికి విశేష సమర్పణ కావించి సూర్యప్రభ వాహనంపై అధిష్ఠింపజేసి తిరువీధులలో ఊరేగించారు. సాధారణంగా రెండుగంటల పాటు సాగాల్సిన సూర్యప్రభ వాహనం అదనంగా 40 నిమిషాల పాటు సాగడంతో భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభించింది. తర్వాత రంగనాయకుల మండపంలో స్వామివారికి ఆస్థానం వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం స్వర్ణ రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవతో నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ముగుస్తాయి. మంగళవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు సమాప్తం కానున్నాయి.

Updated Date - Oct 19 , 2026 | 06:34 AM