UPI యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవు: కేంద్రం స్పష్టీకరణ
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:20 PM
యూపీఐ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. P2P యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితమని క్లారిటీ ఇచ్చింది.
ఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): యూపీఐ యూజర్లకు (UPI Users) ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కేంద్రప్రభుత్వం (Central Government) స్పష్టం చేసింది. P2P యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితమని క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్తులో ఎండీఆర్ (Merchant Discount Rate) వచ్చినా వ్యాపారులందరికీ వర్తించదని తెలిపింది. పరిమిత మర్చంట్స్ ట్రాన్సక్షన్స్ (Merchant Transactions) పైనే నామమాత్రపు ఎండీఆర్ (Merchant Discount Rate) వర్తిస్తుందని పేర్కొంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ఎండీఆర్ కంటే యూపీఐ ఎండీఆర్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పింది.
యూపీఐలో అత్యధిక మర్చంట్స్ ట్రాన్సక్షన్స్ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐ దీర్ఘకాలిక స్థిరత్వం కోసమే PSS Actను సవరించాలని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, ఫ్రాడ్ నివారణకు భారీ పెట్టుబడులు అవసరమని చెప్పింది. యూపీఐని మరింత విస్తరించేందుకు స్వయం-స్థిరమైన ఆదాయ నమూనా అవసరమని పేర్కొంది. జులైలో రూ.2,366 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని తెలిపింది. యూపీఐ భారత్ సొంత ఆవిష్కరణ కేంద్రమని చెప్పింది 11 విదేశాల్లో యూపీఐ అందుబాటులో ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
వార్తలు కూడా చదవండి...
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు
జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News