మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సీబీఐ మెరుపు దాడులు.. ఆ 6 రాష్ట్రాలపై ఫోకస్
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:48 AM
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు శనివారం విసృత్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో (Mahadev Online Betting App Case) దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఈరోజు (శనివారం) విసృత్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అమృత్‌సర్, ఢిల్లీ, భోపాల్, రాయ్‌పూర్, ఇండోర్, ముంబై సహా 13 నగరాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. లైవ్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్యానెల్స్‌ను గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు.
ఈ సోదాల్లో భారీగా డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. మ్యూల్ అకౌంట్లు, హవాలా నెట్‌వర్క్ ద్వారా విదేశాలకు బెట్టింగ్ సొమ్మును తరలించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. నవంబరు 1వ తేదీన ఒమన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చి సౌరభ్ చంద్రకర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 8 రోజుల పోలీస్ కస్టడీలో కీలక విషయాలను సౌరభ్ చంద్రకర్ వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రాయ్‌పూర్ ప్రత్యేక కోర్టు విధించింది. విదేశాల్లో తలదాచుకున్న ఇతర నిందితులను అప్పగించడానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులు అద్దెకు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News