ప్రజాకాంక్ష నెరవేర్చేందుకు మరింత శక్తినిచ్చిన తీర్పు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:40 PM
ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఈ బైపోల్ ఎలక్షన్స్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి సాధించిన ఘనవిజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ(శుక్రవారం) వెలువడ్డాయి. ఈ బైపోల్ ఎలక్షన్స్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి సాధించిన ఘనవిజయం సాధించింది. ఉపఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఎజెండాతో ప్రజలకు ఉన్న బలమైన అనుబంధాన్ని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు.
అస్సాంలోని నగావ్ లోక్‌సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. 'మాకు నిరంతరం ఆశీస్సులు అందిస్తున్న ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూనే, విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తల కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను' అని మోదీ పేర్కొన్నారు.
'పుదుచ్చేరిలోని తట్టంచావడి స్థానంలో విజయం సాధించిన మిత్రపక్షం ఎయిన్ఆర్ కాంగ్రెస్ (AINRC)కు నా అభినందనలు. ఈ ప్రజాతీర్పు మాకు మరింత బాధ్యతను, శక్తిని ఇచ్చింది. ప్రజల సంక్షేమం, సమగ్ర వికాసం, సమ ఉజ్జ్వల భవిష్యత్తు ఆకాంక్షలను నెరవేర్చేందుకు మేము మరింత అంకితభావంతో పనిచేస్తాం' అని ప్రధాని మోదీ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని రెజినగర్‌లో బీజేపీ అభ్యర్థి శంఖారవ్ సర్కార్, నందిగ్రామ్‌లో (Nandigram bypoll) హసిరానీ రత్ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై సర్కార్ 72వేలకు పైగా మెజార్టీ సాధించగా.. లక్షకుపైగా ఓట్లతో హసిరానీ గెలుపొందారు. పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ గెలిచారు.
ఇవి కూడా చదవండి:
పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..
పదేళ్ల తర్వాత జట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!
బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు