Share News

ముంబై ఎయిర్‌పోర్టులో.. 29 కిలోల బంగారం సీజ్..

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:11 PM

ముంబై ఎయిర్‌‌పోర్ట్‌లో 29 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ముంబై ఎయిర్‌పోర్టులో.. 29 కిలోల బంగారం సీజ్..

ముంబై ఎయిర్‌‌పోర్ట్‌లో 29 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..


ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నారని డీఆర్ఐ ( Directorate of Revenue Intelligence) అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు అప్రమత్తమయ్యారు. ఆపరేషన్ ధహాబు పేరుతో విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కెన్యాలోని నైరోబీ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా.. బంగారం బయటపడింది.


కెన్యాకు చెందిన మహిళలు దుస్తులు, బ్యాగుల్లో సుమారు 29 కిలోల బంగారాన్ని దాచినట్లు గుర్తించారు. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు.. మొత్తం 26 మంది కెన్యా దేశస్థులను అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలోని గ్రీన్ ఛానల్ దాటిన తర్వాత.. అధికారులను చూసి పారిపోతుండగా.. అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుకున్న బంగారం విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

Updated Date - Apr 10 , 2026 | 01:20 PM