ఊహించని ట్విస్ట్.. మోనాలిసా భర్తపై పోక్సో కేసు..
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:11 PM
కుంభమేళా ఫేమ్ మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై మధ్య ప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా దంపతులకు ఊహించని షాక్ తగిలింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై మధ్య ప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది. ఇంతకీ సంగతేంటంటే.. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కు చెందిన మోనాలిసాకు సోషల్ మీడియా ద్వారా ఫర్మాన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ పెళ్లికి మోనాలిసా తండ్రి విజయ్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కేరళ వచ్చేశారు.
మార్చి 11వ తేదీన తిరువనంతపురంలోని అరుమనూర్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్ కుట్టితో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరుకావటం గమనార్హం. పెళ్లి తర్వాత మోనాలిసా వయసుపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్’కు ఫిర్యాదు కూడా వెళ్లింది. ఫిర్యాదు మేరకు ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్’ మోనాలిసా వయసుపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహేశ్వర్‌లోని హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం ఆమె 2009 డిసెంబర్ 30వ తేదీన జన్మించింది. పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అంతేకాదు.. పెళ్లి కోసం దంపతులు ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేయించారు. ఫేక్ బర్త్ సర్టిఫికేట్‌తో స్థానిక గ్రామ పంచాయతీలో దంపతులు తమ పెళ్లిని రిజిస్టర్ చేయించారు. దంపతులు ఇచ్చిన ఆధార్ కార్డ్స్ వివరాల ఆధారంగానే తాము పెళ్లి చేశామని అరుమనూర్ ఆలయ పెద్దలు చెబుతున్నారు. ఇక, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ దర్యాప్తులో బయటపడ్డ విషయాల మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద మోనాలిసా భర్తపై కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
వైసీపీ నేత హైటెక్ మోసం.. ఆందోళనలో బాధితులు
సమ్మర్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ఈ వస్తువులు మిస్ అవ్వొద్దు