Share News

సమ్మర్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ఈ వస్తువులు మిస్ అవ్వొద్దు

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:03 PM

వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే ఏమేమి వస్తువులు తీసుకెళ్లాలి అనేది తెలుసుకోవడం చాలా అవసరం.

సమ్మర్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ఈ వస్తువులు మిస్ అవ్వొద్దు
Summer Travel Packing List

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో ట్రిప్ వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే, వేసవిలో ప్రయాణాలు వడదెబ్బ, డీహైడ్రేషన్ కలిగించవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ట్రావెల్‌లో తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన వస్తువులు:

  • ఎండలో చర్మాన్ని కాపాడటానికి సన్‌స్క్రీన్ తప్పనిసరి. ఇది హానికరమైన UVA కిరణాల నుండి చర్మాన్ని రక్షించి, సన్‌బర్న్, నల్లబడటం, అకాల ముడతలను నివారిస్తుంది. కాబట్టి, ఈ సమ్మర్‌లో మీరు ఎక్కడికి వెళ్లినా సన్‌స్క్రీన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

  • సమ్మర్‌లో బయటకు వెళ్లినప్పుడు టోపీ, సన్‌గ్లాసెస్ ధరించడం చాలా అవసరం. సూర్యరశ్మి నుండి తల, కళ్లను రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి. UV కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.

  • వేసవిలో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కాటన్ వంటి తేలికపాటి, దుస్తులను ఎంచుకోవడం మంచిది. శరీరానికి సౌకర్యాన్ని కలిగిస్తాయి.


  • వేసవిలో డీహైడ్రేషన్ రాకుండా ఉండేందుకు మీతో పాటు వాటర్ బాటిల్, అలాగే.. ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకెళ్లాలి. ప్రయాణంలో ఆకలి వేసినప్పుడు తక్షణ శక్తి కోసం ఇవి ఉపయోగపడతాయి.

  • సాధారణ ఆరోగ్య సమస్యలైన జ్వరం, అలర్జీలు, జీర్ణక్రియ సమస్యల వంటి అవసరమైన మందులను మీతో ఉంచుకోవడం ముఖ్యం.

  • ప్రయాణంలోని మధుర క్షణాలను గుర్తుంచుకోవడానికి కెమెరా లేదా మొబైల్‌ను తప్పకుండా మీతో తీసుకెళ్లాలి. వాటితో అందమైన ఫొటోలు తీసుకుని ఆ జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలుపుకోవచ్చు.

  • కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారి తప్పకుండా ఉండేందుకు మ్యాప్ లేదా జీపీఎస్‌ను ఉపయోగించడం చాలా అవసరం. కాబట్టి, మీరు వెళ్లే ప్రదేశానికి సంబంధించిన మ్యాప్‌ను వెంట తీసుకెళ్లడం చాలా ముఖ్యం.

  • డబ్బు, ఐడీ కార్డ్, ఫోన్, మందులు వంటి అవసరమైనవి పెట్టుకునేందుకు ఒక తేలికైన బ్యాగ్ తీసుకెళ్లాలి.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ వేసవి ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుంది. ముందుగానే ప్లాన్ చేసుకుని సరైన వస్తువులు తీసుకెళ్లడం వల్ల ట్రిప్‌ను ఎంజాయ్ చేయవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Apr 10 , 2026 | 12:08 PM