ఈ వ్యక్తుల మధ్య అస్సలు మాట్లాడకూడదు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:02 AM
కొన్ని సందర్భాల్లో, కొంతమంది వ్యక్తుల మధ్య మాట్లాడకపోవడం మంచిదని చాణక్య నీతి సూచిస్తుంది. సరైన సమయంలో మౌనం పాటించడం గౌరవాన్ని కాపాడటమే కాకుండా, అనవసర సమస్యలను కూడా దూరంగా ఉంచుతుందని చాణక్యుడు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను వివరించారు. విజయాన్ని సాధించాలంటే ఎలా ప్రవర్తించాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని దూరం పెట్టాలి? వంటి అంశాలను స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, కొంతమంది వ్యక్తుల మధ్య మాట్లాడకూడదని ఆయన సూచించారు.
ఎవరెవరితో మాట్లాడకూడదు?
భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం అపార్థాలకు, బంధం బలహీనపడటానికి కారణమవుతుంది. వారు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం వాదనను మరింత పెంచుతుంది. కాబట్టి, భార్యాభర్తల మధ్య తలదూర్చకపోవడం మంచిది.
గురువులు లేదా పండితుల మధ్య జరుగుతున్న చర్చలో అనవసరంగా మాట్లాడటం అగౌరవం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే సరైన సమయం చూసి ప్రశ్నలు అడగడం మంచిది. కానీ అనవసరంగా మధ్యలో మాట్లాడటం మంచి పద్ధతి కాదు.
యజమాని-ఉద్యోగి మధ్య జరిగే చర్చలు సాధారణంగా అధికారికమైనవి. మధ్యలో అనుమతి లేకుండా మాట్లాడటం ప్రొఫెషనల్‌గా సరైంది కాదు. సంయమనంతో ఉండి, అవసరమైతే తర్వాత అనుమతి తీసుకుని మాట్లాడడం మంచిది.
వ్యక్తిగత సంభాషణలో ఉన్న ఇద్దరి మధ్య, వారి అనుమతి లేకుండా మధ్యలో మాట్లాడటం ఏ మాత్రం మంచిది కాదని చాణక్యుడు చెప్పారు.
ప్రతి సందర్భానికి ఒక హద్దు ఉంటుందని చాణక్యుడు చెప్పారు. సందర్భం లేకుండా మాట్లాడటం వల్ల అగౌరవం మాత్రమే కాకుండా వివాదాలు కూడా ఏర్పడవచ్చు. అందుకే పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడటం లేదా అవసరమైతే మౌనం పాటించడం ఉత్తమం. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనం వహించాలి అన్నది తెలుసుకోవడం మన గౌరవాన్ని, సంబంధాలను కాపాడుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Latest News