పాము కాటుకు గురైన బాలిక.. ఆస్పత్రికి తరలించే లోపే..
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:29 AM
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల బాలికను త్రాచుపాము కాటేసింది. ఆస్పత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందింది.
కాకినాడ జిల్లా, ఏప్రిల్ 10: యు.కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాము కాటుకు గురై చప్పా దీపిక(13) అనే బాలిక మృతి చెందింది. ఇంట్లో మంచం మీద నిద్రిస్తుండగా రాత్రి 2.30 సమయంలో బాలికను త్రాచుపాము కరిచింది. ఎలుక కరిచిందని భావించి తల్లి మల్లీశ్వరికి చెప్పగా ఉదయం ఆసుపత్రికి వెళ్లి ఇంజెక్షన్ చేయిద్దామని చెప్పడంతో మరలా బాలిక నిద్రించింది.
అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇబ్బందిగా ఉందని బాలిక చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెల్దామని బంధువులను పిలిచింది తల్లి. అప్పటికే బాలికకు నోటి వెంట నురగలు రావడంతో అంబులెన్స్‌కు కుటుంబసభ్యులు సమాచారం అందించారు. ఆసుపత్రిలో వివరాల కోసమని ఆధార్ కార్డు వెతుకుతుండగా మంచం పక్కనే త్రాచుపాము కనిపించడంతో కుటుంబసభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. పాము కరిచిందని నిర్ధారించుకుని హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తరలించాలని భావించగా.. అంబులెన్స్ వచ్చేలోపే పరిస్థితి విషమించడంతో దీపిక ప్రాణాలు కోల్పోయింది. బాలిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవి కూడా చదవండి...
కొండవీడు కోటలో ప్రేమజంట ఆత్మహత్య
ఏసీ వాటర్ వివాదం.. అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి
Read Latest AP News And Telugu News