ఏసీ వాటర్ వివాదం.. అన్నాచెల్లెళ్లపై బ్లేడ్‌తో దాడి
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:30 AM
ఏసీ వాటర్ పడుతున్నాయనే కారణంగా అన్నాచెల్లెళ్లపై బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కాకినాడ, ఏప్రిల్ 10: చిన్న చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాం. కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాల్లో కూడా కత్తులు, రాడ్లతో దాడులకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనల్లో కొందరు గాయాలపాలై బయటపడుతుండగా.. మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోతున్న పరిస్థితి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఏసీ వాటర్ విషయంపై తలెత్తిన చిన్న వివాదం.. దాడిగా మారి.. ఇద్దరిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది.
జగ్గంపేట మండలం నెహ్రూ కాలనీలో ఓ ఇంటి వాకిలిలో ఏసీ నుంచి వచ్చే వాటర్ పడుతుందన్న కారణంగా పక్కంటి మహిళ, ఆమె అన్నపై తండ్రీకొడుకులు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత.. ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో తండ్రీకొడుకులు కలిసి పక్కంటి అన్నాచెల్లెళ్లపై బ్లేడ్‌తో విచాక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఇద్దరికీ వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రీకొడుకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏసీ వాటర్ విషయంలో తండ్రీకొడుకులు ప్రవర్తించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
రోడ్డు ప్రమాదాలపై అలర్ట్.. 28 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
కొండవీడు కోటలో ప్రేమజంట ఆత్మహత్య
Read Latest AP News And Telugu News