పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య
ABN , Publish Date - Apr 10 , 2026 | 09:54 AM
పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.
పల్నాడు జిల్లా, ఏప్రిల్ 10: కొండవీడు కోటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమ విహహాన్ని తల్లిదండ్రులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమజంట పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువతీ, యువకుడు ప్రేమించుకోగా.. వారి ప్రేమను పెద్దలు నిరాకరించారు. యువతికి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. దీంతో ఆమె తీవ్రంగా మనస్తాపానికి గురైంది.
పెళ్లి అయిన తర్వాత కూడా ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక... భర్తను వదిలేసి ప్రేమికుడి వద్దకు వచ్చేసింది యువతి. ఇద్దరు కలిసి జీవించాలని అనుకున్నప్పటికీ పెద్దలు తమ వివాహాన్ని అంగీకరించరని భావించిన ప్రేమజంట కఠిన నిర్ణయం తీసుకుంది. ఈనెల 7న కొండవీడు కోటకు వచ్చిన ఇద్దరు.. అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. వీరిద్దరూ గుంటూరుకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ జంట మృతిపై వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఇవి కూడా చదవండి...
'దయచేసి నన్ను మన్నించండి'.. ఆ కాలేజీ గోడలపై ఓ ప్రేమికుడి పోస్టర్లు
రోడ్డు ప్రమాదాలపై అలర్ట్.. 28 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
Read Latest AP News And Telugu News