Share News

రోడ్డు ప్రమాదాలపై అలర్ట్.. 28 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు

ABN , Publish Date - Apr 10 , 2026 | 09:37 AM

ఎన్టీఆర్ జిల్లాలో బ్లాక్ స్పాట్స్ పరీశలన బస్సు యాత్రలో భాగంగా అధికారులు ఇబ్రహీంపట్నం, కేతనకొండ గ్రామాల్లో పర్యటించారు. మొత్తం 28 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు.

రోడ్డు ప్రమాదాలపై అలర్ట్.. 28 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
NTR district black spots

ఎన్టీఆర్, ఏప్రిల్ 10: ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్లాక్ స్పాట్స్(రోడ్డు ప్రమాద ప్రదేశాలు) పరిశీలన బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, కేతనకొండ గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మొత్తం 28 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రాంతాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటిని సురక్షిత ప్రాంతాలుగా మార్చడానికి తగు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.


ఈ బస్సు యాత్ర కార్యక్రమం ద్వారా అధికారులు ప్రత్యక్షంగా రోడ్లను పరిశీలించారు. కేతనకొండ, ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి, వారధి, ఎనికెపాడు 24కే కల్యాణ మండపం వరకు పర్యటించిన అధికారులు.. అక్కడి రోడ్డు పరిస్థితులను సమీక్షించారు. ఈ ప్రాంతాల్లో వాహనాల వేగం, రోడ్డు వంపులు, ట్రాఫిక్ సమస్యలు తదితర కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గమనించారు.


ఈ బస్సు యాత్ర కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా అంతటా విస్తృతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇది రోడ్డు ప్రమాదాల రేటును తగ్గించడంలో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని, వేగం పరిమితులు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

ఆర్టెమిస్ 2 అప్‌డేట్ షేర్ చేసిన నాసా.. ఈ రోజే భూమి మీదకు..

'దయచేసి నన్ను మన్నించండి'.. ఆ కాలేజీ గోడలపై ఓ ప్రేమికుడి పోస్టర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 10:41 AM