‘ఉగ్ర’ కేసును మాకు అప్పగించండి
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:37 AM
విజయవాడ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఉగ్ర సానుభూతిపరుల కేసు తమకు అప్పగించాలని విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ అధికారులు పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.
విజయవాడ పోలీసులకు ఎన్‌ఐఏ లేఖ
విజయవాడ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఉగ్ర సానుభూతిపరుల కేసు తమకు అప్పగించాలని విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ అధికారులు పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ కేసు విచారణ ఏడు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున తామే దర్యాప్తు చేయాలని ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుల కస్టడీ విచారణ రెండో దఫా జరుగుతోంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి.. నిందితులు అజ్మతుల్లా ఖాన్(బిహార్), లక్కీ అహ్మద్(ఢిల్లీ), మిర్ ఆషిఫ్ అలీ(పశ్చిమబెంగాల్), జిషాన్(రాజస్థాన్), షారుఖ్ ఖాన్(మహారాష్ట్ర), షేక్ ఫయాజ్ ఉర్ రెహ్మాన్(మహారాష్ట్ర)ను విజయవాడ కొత్తపేట పోలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. దీనికిముందు విజయవాడ వన్‌టౌన్ వించిపేటకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్, మహంతిపురానికి చెందిన సొహైల్ బేగ్, భవానీపురానికి చెందిన డానిష్, హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగం, బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంను ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు.