Share News

ఆర్టెమిస్ 2 అప్‌డేట్ షేర్ చేసిన నాసా.. ఈ రోజే భూమి మీదకు..

ABN , Publish Date - Apr 10 , 2026 | 08:57 AM

ఆర్టెమిస్ 2కు సంబంధించి నాసా కీలక అప్‌డేట్ షేర్ చేసింది. వ్యోమగాములు భూమికి సగం దూరంలో ఉన్నారని నాసా తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.

ఆర్టెమిస్ 2 అప్‌డేట్ షేర్ చేసిన నాసా.. ఈ రోజే భూమి మీదకు..
NASA Artemis II

న్యూయార్క్, ఏప్రిల్ 10: నాసా చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతరిక్ష ప్రయోగం ఆర్టెమిస్ 2 విజయవంతం అయింది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మానవులను మళ్లీ చంద్రుడి మీదకు పంపడమే లక్ష్యంగా నాసా ఈ మిషన్‌ను చేపట్టింది. ఏప్రిల్ 1వ తేదీన ఆర్టెమిస్ 2 ఫ్లోరిడా నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఏప్రిల్ 6వ తేదీన చంద్రుడికి అత్యంత సమీపంగా (సుమారు 4,000 మైళ్ల దూరం) వెళ్లి అపోలో 13 రికార్డును అధిగమించింది.


9 రోజుల తర్వాత ఆర్టెమిస్ భూమి మీదకు తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టెమిస్ 2కు సంబంధించి నాసా కీలక అప్‌డేట్ షేర్ చేసింది. వ్యోమగాములు భూమికి సగం దూరంలో ఉన్నారని నాసా తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఈ రోజు (శుక్రవారం) రాత్రి 8.07 గంటల ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఆర్టెమిస్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని ఆ పోస్టులో వెల్లడించింది.


కాగా, వ్యోమనౌక సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చూసుకోవటం కోసం పసిఫిక్ మహాసముద్రంలో యూఎస్ఎస్ జాస్ పీ ముర్తా నౌక సిద్ధంగా ఉంది. వ్యోమనౌక సముద్రంలో దిగే ముందు వేగాన్ని తగ్గించడానికి దాదాపు 11 పారాచూట్లు తెరుచుకోనున్నాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో నాసా ఆర్టెమిస్ 3 మిషన్‌ను చేపట్టనుంది. ఈ మిషన్ ద్వారా మనుషులు చంద్రుడిపై నేరుగా అడుగుపెట్టనున్నారు.


ఇవి కూడా చదవండి

అమరావతి అభివృద్ధిపై ఫోకస్.. నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

వేడి నీళ్లు Vs చల్లటి నీళ్లు.. వేసవిలో తాగడానికి ఏ నీరు మంచిది?

Updated Date - Apr 10 , 2026 | 09:23 AM