నోట్ల కట్టల వివాదం.. పదవికి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా..
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:42 PM
జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు జడ్జి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు జడ్జి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో గతేడాది అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. యశ్వంత్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే సుప్రీంకోర్టు అంతర్గత విచారణలో జస్టిస్ వర్మపై అభియోగాలు నిజమని నిర్ధారణ అయ్యింది.
వివాదం నేపథ్యంలోనే యశ్వంత్ వర్మ ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ మొదలవనున్న తరుణంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేశారు. జస్టిస్ వర్మ రాజీనామాతో న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చ నెలకొంది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
2025, మార్చి 14వ తేదీన రాత్రి 11:35 గంటల ప్రాంతంలో తుగ్లక్ క్రెసెంట్‌లోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లేరు. ఇంటి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది బంగ్లా దగ్గరకు వెళ్లారు. మంటలు ఆర్పుతున్న సమయంలో ఇంట్లోని ఓ గదిలో కాలిపోయిన నగదును వారు కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపింది.
ఇవి కూడా చదవండి
రన్నింగ్ రైల్లో, రెండు బోగీల మధ్యలో.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..
ఊహించని ట్విస్ట్.. మోనాలిసా భర్తపై పోక్సో కేసు..